జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్షా కేంద్రాల్లో 9130 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4580 మంది, బాలికలు 4550 మంది ఉన్నారు. ఈసారి నిమిషం నిబంధనను తొలగించారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత విద్యార్థులను అనుమతించనున్నారు.

0 Less than a minute